![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -154 లో... గంగ బస్తీలో ఉండే శేఖర్, శకుంతల వాళ్ళ ఇంట్లోకి వస్తాడు. గంగకి ట్రైప్యాడ్ ఇచ్చింది నేనే అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏంటి అన్న అలా నా గురించి అబద్ధం చెప్తున్నావ్.. నన్ను నీ సొంత చెల్లిగా చూసావ్, ఇలా ఎలా అబద్ధం చెప్తున్నావని గంగ అడుగుతుంది. అతను నిజమే చెప్పాడు కదా మరి ఎందుకు అతన్ని భయపెడుతున్నావని ఇషిక అంటుంది.
ఆ తర్వాత శేఖర్ అక్కడ నుండి వెళ్ళిపోయాక గంగ అతని వెనకాలే వెళ్లి ఎందుకన్నా అబద్ధం చెప్పావని అడుగుతుంది. గంగ అతన్ని అబద్ధం చెప్పమని రిక్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు ఒకసారి వెళ్తే బెటర్ అని ఇషిక బయటకు వెళ్తుంది. ఎందుకు అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావని గంగని ఇషిక అడుగుతుంది.
సూర్య, స్నేహ, వంశీ వచ్చి ఎవరో ఒకతను వచ్చి వదిన గురించి ఏదో చెప్తే నమ్మేస్తారా అంటారు. నేను చెప్పింది నిజమేనని చెప్పి శేఖర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. గంగ లోపలికి వచ్చి.. నేను ఏ తప్పు చెయ్యలేదు.. అతను ఎందుకు అలా చెప్పాడో ఇప్పటికి అర్థం అవ్వడం లేదని గంగ ఇంట్లో వాళ్ళతో అంటుంది.
సర్ నేను తప్పు చేసానంటే మీరు నమ్ముతున్నారా అని రుద్రతో గంగ అంటుంది. నోరు ముయ్ ముందు ఆ ఏడుపు ఆపు.. తప్పు చెయ్యనప్పుడు ఎందుకు అలా ఏడవడమని రుద్ర అనగానే అంటే తను ఏం తప్పు చెయ్యలేదని నమ్ముతున్నావా అని వీరు అనగానే అవును నమ్ముతున్నాను.. ఎందుకు అంటే షీ ఈజ్ మై వైఫ్ అని రుద్ర అంటాడు. మొదటి నుండి అన్ని చూస్తే గంగని ఎవరో టార్గెట్ చేసారని అర్థం అవుతుందని గంగ కి సపోర్ట్ గా రుద్ర మాట్లాడుతాడు.
తప్పు చేసినట్లు క్లియర్ గా కనిపిస్తుంది అయినా నీ మాటలు ఎందుకు నమ్మాలి. నీకు ఇరవై నాలుగు గంటలు టైమ్ ఇస్తున్న ఆలోపు నీపై పడ్డ నింద.. నిజం కాదని నిరూపించాలి లేదంటే ఇంట్లో ఉండవని శకుంతల అనగానే దానికి గంగ ఒప్పుకుంటుంది.
ఆ తర్వాత గంగ వచ్చి బాధపడుతుంటే రుద్ర వచ్చి మంచిగా థింక్ చెయ్ ఏదో ఒక దారి దొరుకుతుందని అంటాడు. గంగకి ఏం చేయాలో అర్థం కాదు. రుద్ర దగ్గరుండి గంగకి సలహా ఇస్తాడు. ఆ తర్వాత ఇషిక, వీరు, పారు ముగ్గురు మాట్లాడుకుంటారు. శేఖర్ ని ఎలా బ్లాక్ మెయిల్ చేసి రప్పించారో ఇషిక, వీరు కలిసి పారుకి చెప్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |